Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్ష్మీరాయ్ ఐరెన్ లెగ్... రాయ్ లక్ష్మీ గోల్డెన్ లెగ్... మురిసిపోతున్న రాయ్...

లక్ష్మీరాయ్ ఐరెన్ లెగ్... రాయ్ లక్ష్మీ గోల్డెన్ లెగ్... మురిసిపోతున్న రాయ్...
, గురువారం, 18 డిశెంబరు 2014 (14:38 IST)
సినిమా తారలకు పేరు మార్చుకోవడం చాలా ఈజీ. అసలు పేరుతోనే కొంతకాలం లాగించేస్తారు. హిట్లు కొడతారు. కానీ ఆ తర్వాత గ్యాప్‌ రాగానే... పేరులో ఏదో దోషం వుందని మార్చేస్తారు. అలా చాలామంది వున్నారు. తాజాగా లక్ష్మీరాయ్‌ తన పేరు మార్చుకుంది. తమిళంలో సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌ మణి సినిమాలో నటించింది. అందులో హన్సిక, ఆండ్రియా కూడా వున్నారు. 

 
దెయ్యం ఆవహించిన పాత్రలో ఆమె కన్పిస్తుంది. సెప్టెంబర్‌లో విడుదలై హిట్‌ అయింది. ఆ చిత్రాన్ని సి.కళ్యాణ్‌ తెలుగులో 'చంద్రకళ'గా విడుదల చేస్తున్నారు. అయితే అంతకుముందు లక్ష్మీరాయ్‌ అన్న పేరును ఈ సినిమాతో రాయ్‌‌లక్ష్మీగా మార్చింది. దీంతో తొలి హిట్‌ కొట్టగానే ఇది కలిసివచ్చిందని భావించింది. అందుకు తగినట్లుగానే కొత్త ఏడాదిలో ఓ అగ్ర సినిమాలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయాలు త్వరలో చెబుతానని అంటోంది. రాయ్ లక్ష్మీతో లక్ కొట్టిందన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu