Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనసూయతో చంద్రమోహన్: 'కత్తిలాంటి అమ్మాయితో చాకులాంటి కుర్రాడు'!

అనసూయతో చంద్రమోహన్: 'కత్తిలాంటి అమ్మాయితో చాకులాంటి కుర్రాడు'!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:32 IST)
అనసూయతో చంద్రమోహనా.. ఇదేంటి అనుకుంటున్నారా.. ? స్టోరీ చదవండి. తెలుగు వెండితెరపై మాంచి హీరోగా.. హాస్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఓ వెలుగు వెలిగిన చంద్రమోహన్.. మల్టీస్టారర్ మూవీలో తన సరసన మరో హీరోగా చేసిన చిరంజీవి లాంటి హీరోకి మళ్ళీ తనే తండ్రి పాత్రను వేసి మెప్పించారు. చంద్ర మోహన్ సరసన హీరోయిన్‌గా చేస్తే వారికి మంచి కెరీర్ ఉంటుందని అప్పట్లో ఇండస్ట్రీ టాక్.
 
కాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత సరిగ్గా తెలుగు ఇండ్రస్ట్రీ పరభాషా నటుల మోజులో పడిపట్టించుకోలేదని సినీ వర్గాల టాక్. కాగా ఇటీవలే హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకున్న చంద్రమోహన్.. బుల్లితెరపై కనిపించబోతున్నాడు. ఈ మధ్య ఫిలింనగర్‌లో జరిగిన 'మహా మృత్యుంజయ హోమం'లో చంద్రమోహన్ కనిపించారు. అంతేకాదు తనకు అవకాశాలు ఇస్తే పరభాషా క్యారెక్టర్ ఆర్టిస్టులు కన్నా మిన్నగా నటించే శక్తి తనకు ఉంది అంటూ ఈమధ్య కామెంట్స్ కూడా చేశారు.
 
ఐతే చంద్ర మోహన్ బుల్లితెరపై సంచలనం సృష్టించబోతున్నారు అనే వార్తలు షికారు చేస్తున్నాయి. 'కత్తిలాంటి అమ్మాయితో చాకులాంటి కుర్రాడు' అని అంటూ చంద్రమోహన్ యాంకర్‌ అనసూయతో కలిసి డైలాగ్‌ చెపుతూ ఒక షోలో కనిపించబోతున్నాడని టాక్...!

Share this Story:

Follow Webdunia telugu