Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బ్రహ్మోత్సవం'కు నటీనటుల కొరత..! కొత్తవారికి ఆహ్వానం..!

'బ్రహ్మోత్సవం'కు నటీనటుల కొరత..! కొత్తవారికి ఆహ్వానం..!
, గురువారం, 5 మార్చి 2015 (09:05 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు నటీనటుల కొరత ఏర్పడినట్టు సమాచారం. దీంతో కొత్తవారిని ఆహ్వానిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ 'పీవీపీ సినిమా' ఇందుకు సంబంధించిన కేస్టింగ్ కాల్ ఇచ్చింది.
 
ఈ చిత్రంలో నటించేందుకు 15 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్య గల ఆడ, మగ పాత్రల కోసం కొత్త ఆర్టిస్టులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తిగల ఔత్సాహిక కళాకారులు రెండు ఫుల్ సైజ్ ఫోటోలను, రెండు క్లోజప్ ఫోటోలతో తమను సంప్రదించాలని చిత్ర యూనిట్ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu