Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వేతాబసు బ్యాక్ ఇన్ బిజినెస్: హన్సల్ మెహతా డాక్యుమెంటరీలో..!

శ్వేతాబసు బ్యాక్ ఇన్ బిజినెస్: హన్సల్ మెహతా డాక్యుమెంటరీలో..!
, గురువారం, 27 నవంబరు 2014 (13:35 IST)
శ్వేతాబసుకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఇటీవల సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయి.. రెస్క్యూ హోంలో ఉండి వచ్చిన శ్వేతబసు ప్రస్తుతం ముంబైలో తన తల్లిదండ్రులతో గడుపుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ హీరోయిన్ అయిన శ్వేత బసు తెలుగులో కొత్త బంగారు లోకం ద్వారా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో రెస్క్యూ హోం నుంచి రిలీజ్ అయిన శ్వేతబసుకు మంచి అవకాశం లభించింది. జాతీయ అవార్డు గ్రహీత హన్సల్ మెహతా డాక్యుమెంటరీలో శ్వేతబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించనుంది. దీనికి సంబంధించి హన్సల్ శ్వేతబసును కలిసి ఒప్పించారని తెలిసింది. ఇందుకు శ్వేతబసు కూడా ఓకే చెప్పిందని.. మరోవైపు మంచు విష్ణు కూడా శ్వేతబసుకు మద్దతిచ్చాడు. 
 
దీనిపై శ్వేత బసు స్పందిస్తూ.. ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని, హన్సల్ తనకు జాలితో ఛాన్సివ్వలేదని, తన టాలెంట్‌ను నమ్మి ఆఫరిచ్చారని చెప్పుకొచ్చింది. ఇంకేముంది.. శ్వేతబసు సుడి తిరిగిందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu