Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మానందంతో రెండు సార్లు చేయించిన శ్రీను వైట్ల...

బ్రహ్మానందంతో రెండు సార్లు చేయించిన శ్రీను వైట్ల...
, శుక్రవారం, 22 ఆగస్టు 2014 (19:51 IST)
హాస్యంలోనే బ్రహ్మగా పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మానందం అంటే లేని సినిమానే లేదు. తెలుగులో ఎంతోమంది యువకులు వచ్చినా.. బ్రహ్మానందం ప్లేస్‌ పదిలంగా వుంది. ఒకప్పుడు బ్రహ్మానందం వేరు. ఇప్పుడు బ్రహ్మానందం వేరు. కొత్తగా వచ్చేవారిని మంచి చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు. యూత్‌లో టాలెంట్‌ వుందని ఎంకరేజ్‌ చేస్తున్నాడు. ఇదిలావుండగా.. మహేష్‌ బాబు నటించిన 'ఆగడు'లో బ్రహ్మానందం రొటీన్‌గా... అందరి చేత బకరా అయిపోతాడు. 
 
పలు సినిమాల్లో తనే బకారా కాకుండా ఎదుటివారిని చేయాలని అతనే అయిపోతుంటాడు. ఇందులోనూ హీరోను బకారా చేయాలని చూస్తే తనే అయిపోతాడు. ఈ సన్నివేశాన్ని దర్శకుడు శ్రీను వైట్ల చెప్పి చేయమంటే.. నాలుగైదు సార్లు రొటీన్‌గా చేసినట్లు వుండటంతో ఇంకా కొత్తగా చేయాలని అడిగాడట. దాంతో మరో రెండుసార్లు చేసినా ఫలితం లేకపోవడంతో.. కాస్త గ్యాప్‌ ఇచ్చి మరో సన్నివేశాన్ని తీసినట్లు సమాచారం. అదే కొత్త సినిమాల్లో అయితే బ్రహ్మానందం చేసిందే నటన. మరి శ్రీను వైట్ల విషయంలో కాదు.. అందుకే బ్రహ్మానందం రూటు మారుతోందా! హవా తగ్గుతోందా... అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu