Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పర్సనల్ లైఫ్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్... బిపాసా

పర్సనల్ లైఫ్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్... బిపాసా
, మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (11:26 IST)
బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగుతున్న బ్లాక్ బ్యూటీ బిపాసాబసు. ఈ అమ్మడు సినీ తెరంగేట్రం చేసి దశాబ్దంన్నర అవుతున్నా, అవకాశాలు ఏమాత్రం తగ్గకపోగా, ఇంకా బిజీగా సినిమాలు చేస్తోంది. ఈ సందర్భంగా, అప్పటి నుంచి ఇప్పటివరకు మీ కెరీర్‌ను ఎలా విశ్లేషిస్తారు? అని బిప్స్ ను అడిగితే, 'ముందు పర్సనల్ లైఫ్, తర్వాతే వర్క్' అంటూ టక్కున సమాధానం ఇచ్చింది.
 
అంతేకాకుండా గత ఆరేళ్లలో తాను 60కి పైగా చిత్రాలు చేశానని తెలిపింది. ఒకానొక సమయంలో ఒక సినిమా మాత్రమే చేస్తూ వచ్చినట్లు గుర్తుచేసుకుంది. ఎందుకంటే, జీవితాన్ని ఆస్వాదించడానికే తాను ఇష్టపడతానంటోంది బిపాసా. జీవితం వెళ్లిపోతే తిరిగి రాదని, అందుకే తాను పర్సనల్ లైఫ్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని అమ్మడు తేల్చి చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu