Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుల్లితెర నటుడు అనుమానాస్ప మృతి.. ఈత కొలనులో శవమై తేలి..!

బుల్లితెర నటుడు అనుమానాస్ప మృతి.. ఈత కొలనులో శవమై తేలి..!
, ఆదివారం, 17 మే 2015 (16:37 IST)
ప్రముఖ బుల్లి తెర నటుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. బెంగాల్ టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చి, టీవీ సీరియల్స్‌లో నటిస్తూ సినిమాల్లో చిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్న అప్ కమింగ్ నటుడు రోనెన్ చక్రవర్తి. ఇతగాడు ఈత కొలనులో మృత దేహంగా తేలాడు. వివరాల్లోకి వెళితే.. రోనెన్ చక్రవర్తి ఇంటికి దగ్గరలో ఓ స్విమ్మింగ్ ఫూల్‌ ఉంది.
 
ఎప్పటిలానే శనివారం రాత్రి తన స్నేహితులతో కలసి స్విమ్మింగ్ ఫూల్ వెళ్ళిన తను శవమై కనిపించడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులని ఆశ్రయించారు. టీవీ రంగంలో చిన్న చిన్నగా ఎదుగుతున్న రోనెన్ అకస్మాతుగా చనిపోవడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు రోనెన్ చక్రవర్తి మృతిపై దర్యాప్తు ప్రారంభించారు. టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన రోనెన్ చక్రవర్తి ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu