Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాల్లో రాణించాలంటే.. బుర్రకూడా కావాలి!: శృతిహాసన్

సినిమాల్లో రాణించాలంటే.. బుర్రకూడా కావాలి!: శృతిహాసన్
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (11:55 IST)
సినిమాల్లో రాణించాలంటే.. అందమే కాదు.. బుర్రకూడా కావాలి! అంటోంది గబ్బర్ సింగ్ భామ శృతిహాసన్. "ఇక్కడ నెగ్గుకురావాలంటే కథానాయికలకు అందం ఒక్కటే వుంటే సరిపోదు. ఏ పరిస్థితులకు ఎలా స్పందించాలో తెలిసే తెలివితేటలు కూడా వుండాలి. అటువంటి బ్రెయిన్ లేనప్పుడు మనకు ఎంత అందం వున్నా శుద్ధ దండగే" అని చెప్పింది.
 
తాము అందంగా ఉన్నప్పటికీ తమ అందాన్ని ద్విగుణీకృతం చేసే మేకప్ మేన్, స్టయిలిస్ట్ వుంటారనీ, కానీ తెలివితేటల్ని నేర్పడానికి మాత్రం ఎవరూ ఉండరనీ చెప్పింది. "మొదట్లో కొన్ని తప్పులు చేస్తాం. వెంటనే వాటి నుంచి పాఠాలు నేర్చుకుని, మళ్లీ ఆ తప్పులు చేయకుండా ప్లాన్ చేసుకునే తెలివితేటలు మనకు వుండాలి. అప్పుడే సక్సెస్ అవుతాం" అంటోంది శృతి.

Share this Story:

Follow Webdunia telugu