Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాల వేసినా నీజతగా బోల్తా... ఇప్పుడు 'గోవిందుడు' కోసం బండ్ల హోమం....

మాల వేసినా నీజతగా బోల్తా... ఇప్పుడు 'గోవిందుడు' కోసం బండ్ల హోమం....
, బుధవారం, 1 అక్టోబరు 2014 (19:16 IST)
సినిమా ఇండస్ట్రీలో పూజలు, మాలలు ధరిస్తుంటారు. సెంటిమెంట్‌గా ఫీలవుతుంటారు. సినిమా విడుదలకు ముందు చాలా చేస్తుంటారు. హీరోలయితే దర్గాలకు, తిరుపతిలకు వెళుతుంటారు. నిర్మాతలు సరేసరి. ఇప్పుడు బండ్ల గణేష్‌... అదే చేస్తున్నాడు. ముంబై నటుడు సచిన్‌తో నీ జతగా నేనుండాలి .. సినిమా చేశాడు. ఆ సినిమా రిలీజ్‌కు ముందు ఆషీకీ-2ను చెడగొట్టదని తెలుగులో అద్భుతంగా ఆడుతుందని చెప్పాడు. 
 
అందుకు అయ్యప్ప మాల ధరించి... నిష్టలో వున్నాడు. సినిమా విడుదలయ్యాక మాల తీశాడు. అయితే ఆ సినిమా రెండురోజుల కంటే ఎక్కువ ఆడలేదు. ఇప్పుడు రామ్‌ చరణ్‌ నటించిన 'గోవిందుడు.. సినిమాకు' తెల్లటి ధోవతి ధరిస్తూ కొత్తగా కన్పించాడు. 
 
మెగాస్టార్‌ బాబు సినిమా హిట్‌ అవ్వాలని.. కలెక్షన్లు రికార్డులు బద్ధలు కొట్టాలని ... హోమం చేస్తున్నట్లు చెప్పాడు. అయితే.. హీరోలకు 8వ సెంటిమెంట్‌... ఫ్లాప్‌లు‌న్నాయి. ఆ విషయంలోనూ బీట్‌ చేస్తామని చెప్పాడు. మరి.. అది బీట్‌ చేస్తాడో లేదో.. దసరా తర్వాత గాని తెలియదు..

Share this Story:

Follow Webdunia telugu