Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపాన్‌లో 'బాహుబలి' రిలీజ్.. జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు..

జపాన్‌లో 'బాహుబలి' రిలీజ్.. జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు..
, శుక్రవారం, 26 జూన్ 2015 (10:57 IST)
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం 'బాహుబలి'. భారత సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. 'బాహుబలి' జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ వేగంగా జరుగుతున్నాయి.
 
ప్రస్తుత తాజాగా సమాచారం ఏమిటంటే... జపాన్‌లో తమిళ చిత్రాలకు ఆదరణ అధికంగానే ఉంది. దీంతో బాహుబలి తమిళ వెర్షన్‌ను అక్కడ విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయం తెలిసి జపాన్‌లో ఉన్న అభిమానులు అమిత ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu