Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆరంభం..!

బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆరంభం..!
, మంగళవారం, 27 జనవరి 2015 (12:48 IST)
సంచలనాత్మక దర్శక దిగ్గజం రాజమౌలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాక్మక చిత్రం బాహుబలి. ప్రముఖ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆరంభమయ్యాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పార్ట్ పూర్తి కాగా, రెండు పాటలు మాత్రమే బేలన్స్ ఉన్నట్టు చిత్ర యూనిట్ సమాచారం. 
 
అంతేకాకుండా తెలుగు, తమిళ భాషలకు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తైంది. ఈ చిత్రానికి సంబంధించిన శబ్దాలను బాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీలో మిక్స్ చేసే పనులు వచ్చే నెల నుంచి చేస్తారు. 
 
విజువల్ ఎఫెక్ట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడ్తున్నారు. శ్రీనివాసన్ మోహన్ నేతృత్వంలో విఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అనుష్క విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా.. ప్రభాస్, రాణాలు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu