Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ భక్తిని చాటే ''బేబీ''... షార్ట్ రివ్యూ : అక్షయ్, రానా, తాప్సీ అదుర్స్...!

దేశ భక్తిని చాటే ''బేబీ''... షార్ట్ రివ్యూ : అక్షయ్, రానా, తాప్సీ అదుర్స్...!
, శుక్రవారం, 23 జనవరి 2015 (18:16 IST)
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బేబీ చిత్రం దేశ భక్తితో కూడుకున్నది. ఎప్పుడూ వినోదభరిత సినిమాల్లో నటించే అక్షయ్ కుమార్ యాక్షన్, సీరియస్ కాన్సెప్ట్ కలగలిపిన బేబీ మూవీలో అదరగొట్టాడు. నీరజ్ పాండే మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి, అనుపమ్ ఖేర్ నటించిన బేబీ సినిమా బాలీవుడ్‌లో శుక్రవారం (జనవరి 23)న విడుదలైంది. 
 
ఎప్పుడూ తాను తెరకెక్కించే సినిమాల ద్వారా విమర్శలు ఎదుర్కొనే నీరజ్ పాండే ఈసారి తన డైరక్షన్‌తో నటులకు కూడా ప్రశంసలు సంపాదించిపెట్టాడు. బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ సినిమాపై ఇప్పుడే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బేబీ తర్వాత నీరజ్ పాండే ఎ వెడ్‌నెస్‌డే, స్పెషల్ 26ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో డానీ, తాప్సీ మికాల్, మధురిమ తులి ప్రధాన పాత్రలు పోషించారు. 
 
‘బేబీ’ సినిమా కథాంశం ఏమిటంటే.. సినిమా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రూపొందించబడింది. పాక్‌కు  చెందిన ఉగ్రవాదులు భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ‘ఆపరేషన్ బేబీ’ అనే ప్లాన్‌ను హీరో ఎలా భగ్నం చేశాడనేదే. ఈ సినిమాపై ఇప్పటికే ట్వీట్లు వెల్లువల్లా వస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు నీరజ్ పాండేతో పాటు అక్షయ్ కుమార్ తదితర నటులను మెచ్చుకుంటూ ట్వీట్ల ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu