Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచారం కంటే అది దారుణం : హన్సిక ఆవేదన

అత్యాచారం కంటే అది దారుణం : హన్సిక ఆవేదన
, శుక్రవారం, 6 మార్చి 2015 (16:31 IST)
వెండితెరపై అందచందాలను ఆరబోసే అందాల తారలు అనునిత్యం షూటింగ్‌ల కోసం దేశ విదేశాలకు వెళుతుంటారు. ఆ సమయాల్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అంతే సంగతులు. రహస్య కెమెరాలకు బలైపోవాల్సిందే. ఆ తర్వాత ఎంత గగ్గోలిపెట్టినా ప్రయోజనం ఉండదు.
 
ఆ విధంగానే ఆ మధ్య నటి రాధికా ఆప్టే, ఇటీవల హన్సికలు బలయ్యారు. అయితే విషయం తెలిసిన హన్సికా తొలుత తడబడినా, ఆ తర్వాత కోలుకుని ఆ వీడియోలో ఉన్నది తానుకాదని తెలిపింది. అయినా కూడా ఆ వ్యక్తి హన్సిక చేతికి చిక్కాడంటే చిత్తు చేస్తుంది.
 
ఈ విషయం గురించి తాజాగా హన్సిక మాట్లాడుతూ.. సినీ స్టార్స్ అంటే ఏదో జాలీగా ఎంజాయ్ చేసేవాళ్లు అనుకోకండి అని తెలిపింది. తాము నిరంతరం షూటింగ్‌లలో పాల్గొంటూ శ్రపడుతున్నట్టు చెప్పింది. రహస్యంగా కెమెరాలు ఉంచి, తారల ప్రైవేట్ లైఫ్‌ని పబ్లిక్ చేయడం అనేది అత్యాచారం కంటే దారుణమైన విషయం అని హన్సిక అభిప్రాయపడింది.
 
అసలు మమ్మల్ని బజారుకి ఈడ్చడానికి మీకు మనసు ఎలా వస్తుంది? అంటూ ఆవేశపూరితంగా హన్సిక ప్రశ్నిస్తోంది. మా మనసు కష్టపెట్టేవాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu