Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క ఆభరణాలు అమ్మకానికి... భారీ ధర పలికేనా..!

అనుష్క ఆభరణాలు అమ్మకానికి... భారీ ధర పలికేనా..!
, శనివారం, 28 ఫిబ్రవరి 2015 (17:31 IST)
టాలీవుడ్ క్రేజీ బ్యూడీ అనుష్క నటించిన చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుష్క ధరించిన నగలు ఒరిజినల్‌వే అన్న విషయం తెలిసిందే. ఈ నగలను చెన్నైలోని ప్రముఖ నగల దుకాణం ఒకటి సుమారు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి తయారుచేసింది.
 
వజ్రాలు పొదిగిన ఈ బంగారు ఆభరణాలతో 'రుద్రమదేవి'లో అనుష్క మెరిసిపోతుంది. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్తికావడంతో ఈ ఆభరణాలను సదరు నగల దుకాణం అమ్మకానికి ఉంచింది. ఈ ఆభరణాలను భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసుకునేందుకు ఎవరు ముందుకొస్తారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చి నెల చివరి వారంలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu