Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ఎదుగుదలకు వారే కారణం: అనుష్క

నా ఎదుగుదలకు వారే కారణం: అనుష్క
, సోమవారం, 30 మార్చి 2015 (14:51 IST)
నటి అనుష్క... తన ఎదుగుదలకు తన చుట్టూ వున్నవారే కారణమని చెబుతోంది. తను ఈ రంగంలో రాణించడానికి తన శ్రమేకాదు.. చుట్టూ వున్నవారు కలిసి సహకరించారని అంటోంది. తమన్నా గురించి అనుష్క చెపుతూ.. ఆమె ఇండస్ట్రీకి వచ్చి తమన్నా మాదిరిగానే పదేళ్ళయింది. తమన్నా, నేను కలిసి ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించింది. నేను తెలుగులో పాపులర్‌ అయ్యాను. సినిమా కథ విన్నాక.. అందులో పాత్రల్లోని వైవిధ్యం చూస్తుంటాను. అది నచ్చితే తప్పకుండా చేస్తాను. 
 
ఒకసారి అరుంధతి చేస్తే ఆ చిత్రం ఎంతో హిట్టయింది. మళ్ళీ పంచాక్షరి కథతో మేకప్‌మేన్‌ చందు నా దగ్గరకు వచ్చారు. అందులోని పాత్ర, ఊరి జనాల కోసం ఏదో చేయాలని అమ్మాయి కథ నచ్చి అంగీకరించాను. అసలు ఆ కథను మొదట్లో కొంతమంది వద్దన్నారు. కానీ చేశాక మంచి రిజల్ట్‌ వచ్చింది. ప్రస్తుతం కథ ఎంపికలో తగుజాగ్రత్తలు తీసుకుంటున్నాని అని చెప్పింది. బహుబలి, రుద్రమదేవి.. చిత్రాలు ఈ ఏడాది నా కెరీర్‌లో మరింత పైకి తీసుకెళతాయని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu