Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలయాళ హీరో సరసకు క్రేజీ బ్యూటీ.. మమ్ముట్టితో అంజలి రొమాన్స్..!

మలయాళ హీరో సరసకు క్రేజీ బ్యూటీ.. మమ్ముట్టితో అంజలి రొమాన్స్..!
, శనివారం, 28 ఫిబ్రవరి 2015 (10:33 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో వెలుగుతున్న క్రేజీ బ్యూటీ అంజలి సీనియర్ హీరోల సరసకు‌ సై అంటోంది. ఆ మధ్య కుటుంబ సమస్యల కారణంగా సినిమాలకు దూరమైన అమ్మడు, మెల్లెగా మళ్లీ లైన్‌లో పడింది. తాజాగా ఈ బ్యూటీ తమిళంలో స్పీడు పెంచింది. ఇప్పటికే అక్కడ ఒకటి రెండు సినిమాలు చేస్తున్న అంజలి ప్రముఖ మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఇటీవల మలయాళ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టిలో తమిళ సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ రూపొందించే చిత్రంలో నటించడానికి మమ్ముట్టి అంగీకరించారు. ఇందులో ఆయన సరసన అంజలి కథానాయికగా ఎంపికైంది. ఆమెతో బాటుగా ఆండ్రియా కూడా మరో కథానాయికగా నటిస్తుంది. మరో మూడు నెలల్లో ఈ చిత్రం మొదలవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu