Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైటర్‌గా అమితాబ్: ఓన్లీ పెళ్ళిళ్లపై పుస్తకం రాస్తున్నారట!

రైటర్‌గా అమితాబ్: ఓన్లీ పెళ్ళిళ్లపై పుస్తకం రాస్తున్నారట!
, సోమవారం, 30 మార్చి 2015 (16:46 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రైటర్‌గా అవతారం ఎత్తనున్నారు. విభిన్నమైన పాత్రలతో తనలోని నటుడిని ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న 'బిగ్ బి' దృష్టి ఇప్పుడు రచనా వ్యాసంగం వైపు మళ్లింది.

త్వరలోనే ఆయనో పుస్తకం రాయనున్నట్టు బాలీవుడ్ జనం అను. వివాహం అనేది ఓ వ్యవస్థ అని, గోవాలో బెంగాలీ కుటుంబ వివాహం... ఇలాంటివి తనను ఆకట్టుకుంటాయని ట్విట్టర్లో తెలిపారు. 
 
పెళ్లిళ్లే ఇతివృత్తంతా తానో పుస్తకం రాయాల్సి వచ్చేట్టుందని అమితాబ్ ట్వీట్ చేశారు. అన్నట్టు... అమితాబ్ ఇటీవలే క్రికెట్ వరల్డ్ కప్‌లో కామెంటరీ చెప్పి, తనకు ఆ ఫీల్డ్ కొత్త అయినా, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో రైటర్‌గానూ ఆయన మెప్పించడం ఖాయమని సినీ జనం అనుకుంటున్నారు. 
 
ఇదిలా ఉంటే భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు అమితాబ్ బచ్చన్ అభినందించారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ర్యాంకింగ్స్ సాధించడం ద్వారా రికార్డు సృష్టించడాన్ని అమితాబ్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. 

Share this Story:

Follow Webdunia telugu