Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27న అమితాబ్ బచ్చన్కు అక్కినేని అవార్డు ప్రదానం

27న అమితాబ్ బచ్చన్కు అక్కినేని అవార్డు ప్రదానం
, శనివారం, 20 డిశెంబరు 2014 (14:16 IST)
ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శనివారం వెల్లడించింది. 
 
గత 2005వ సంవత్సరం నుండి భారతీయ సినిమా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న వారిని అక్కినేని అవార్డును ప్రదాం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కారం కింది రూ.5 లక్షల నగదుతో పాటు ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు.
 
కాగా 2013 సంవత్సరానికి గానూ అమితాబ్కు అక్కినేని ఫౌండేషన్ ప్రదానం చేయనుంది. గతంలో ఈ అవార్డును దేవానంద్, షబానా అజ్మి, అంజలి దేవి, లతా మంగేష్కర్, వైజయంతి మాలా, బాలచందర్, హేమమాలిని, శ్యాం బెనగల్ తదితరులు అందుకున్న విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu