Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానులపై ఆడిన లాఠీ... పోలీసులపై అల్లు అర్జున్‌ గరం

అభిమానులపై ఆడిన లాఠీ... పోలీసులపై అల్లు అర్జున్‌ గరం
, శుక్రవారం, 18 జులై 2014 (20:48 IST)
అల్లు అర్జున్‌ అంటేనే చాలు అభిమానులు పొలోమంటూ.. తెగ వచ్చేస్తుంటారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి రోడ్డుపైకి వస్తే చూసేందుకు ఎగబడేవారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ పరిస్థితి అలా మారింది. యూత్‌ ఎక్కువగా ఆయన ఓ షాప్‌ ఓపెనింగ్‌ వచ్చినా హడావుడి చేస్తుంటారు. 
 
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సెల్‌ఫోన్‌ షోరూమ్‌ ఓపెన్‌ చేస్తే గత ఏడాది అక్కడ ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం పోలీసులకు జేజేమ్మ కనబడింది. అయితే ఇదే పరిస్థితి తిరుపతిలో జరిగింది. ఓ నగల దుకాణం ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన్ను చూడ్డానికి అభిమానులు తెగ వచ్చేశారు. 
 
ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు దిగేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో అక్కడ కంట్రోల్‌ తప్పింది. పోలీసులు గతి లేక లాఠీలకు పనిచేప్పే పరిస్థితి వచ్చింది. దాంతో అల్లు అర్జున్‌ హడావుడిగా వెళ్ళిపోయారు. అయితే.. అక్కడ జనాల్ని కొట్టడం అల్లు అర్జున్‌కు కోపం తెప్పించింది. పోలీసులు తగినంతగా లేకుండా ఉండటంతోనే అదుపు తప్పిందని... వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో నిర్వాహకులు సర్ది చెప్పి పంపించేశారు.

Share this Story:

Follow Webdunia telugu