Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను కూడా అలాంటిదాన్నే... అవసరమైతే లిప్‌లాక్స్‌కు కూడా.. ఇషా చావ్లా!

నేను కూడా అలాంటిదాన్నే... అవసరమైతే లిప్‌లాక్స్‌కు కూడా.. ఇషా చావ్లా!
, శనివారం, 7 జూన్ 2014 (12:51 IST)
కామెడీ స్టార్ అల్లరి నరేష్ డబుల్ రోల్‌లో నటిస్తోన్న 'జంప్ జిలానీ'లో ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ''లడ్డూబాబు'' నిరాశపరచడంతో నరేష్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ''కలగల్పు'' సినిమాకి ఇది రీమేక్. తెలుగు నెటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమాను జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా ఇషా చావ్లా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో తాను మెడికల్ ఆఫీసర్‌గా నటించినట్లు ఇషా తెలిపింది. 'జంప్ జిలానీ' అనే టైటిల్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటని అడగ్గా... ఇందులో ప్రతిపాత్ర ఏదో ఒక సందర్భంలో జంప్ చేస్తుంటుంది. అందరూ ''జంప్ జిలానీలే'' అందుకే ఈ టైటిల్‌ను పెట్టారన్నారు.

నిజజీవితంలో మీరు జంప్ చేసిన సందర్భాలున్నాయా అన్న ప్రశ్నకు.. అవును నేను కూడా అంటువాంటి దాన్నే.. స్కూల్ డేస్‌లో ఎప్పడూ జంపింగ్‌లే, సరిగ్గా వెళ్లేదాన్ని కాదు అని ఆమె చెప్పారు. ఇంకా సినిమాల్లో ఎక్స్‌పోజింగ్, ముద్దుల గురించి చెబుతూ.. నేను ఎప్పడూ హద్దుమీరలేదు... ఇప్పటివరకూ ముద్దుసీన్లలో నటించిమని ఎవరూ నన్ను అడగలేదు. ఒకవేళ భవిష్యత్తులో అటువంటి సీన్స్‌లో నటించాల్సి వస్తే ఆలోచిస్తానని ఇషా చావ్లా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu