Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"యాన్" సినిమాపై ఆశలు పెట్టుకున్న కడలి తులసి!!

, గురువారం, 2 అక్టోబరు 2014 (14:00 IST)
రాధ కూతురు తులసి గుర్తుందా? కడలి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ తమిళంలో జీవాతో యాన్ చిత్రంలో తాజాగా నటించింది. రాధ కూతురైనా అక్క కార్తీక కంటే ఆఫర్లు స్లోగానే వస్తున్నప్పటికీ.. యాన్ సినిమాపైనే ఆమె గుప్పెడు ఆశలు పెట్టుకుంది. 
 
రాధ పెద్ద కూతురు కార్తీక హీరోయిన్‌గా బాగానే రాణిస్తున్నప్పటికీ చిన్న కూతురు తులసికి మాత్రం హీరోయిన్‌గా బ్రేక్ రాలేదు. తులసి మణిరత్నం 'కడలి' ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 
 
ప్రస్తుతం తులసి తమిళంలో జీవాకు జంటగా 'యాన్' చిత్రంలో నటించింది. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా గురువారం రిలీజ్ అవుతుంది. 'యాన్' చిత్రం హీరోయిన్‌గా తనకు కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఈ చిత్రంలో, తనది నటనకు ఆస్కారమున్న పాత్ర అని, ఛాలెంజ్‌గా తీసుకుని ఆ పాత్రను పోషించానని తులసి చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu