Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అఖిల్‌తో నో చెప్పిన అలియా భట్.. హీరోయిన్ ఎవరబ్బా?

అఖిల్‌తో నో చెప్పిన అలియా భట్.. హీరోయిన్ ఎవరబ్బా?
, గురువారం, 18 డిశెంబరు 2014 (13:56 IST)
హీరోగా మొదటి సినిమా మొదలుకాకుండానే బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు అక్కినేని అఖిల్. అయితే అఖిల్ మొదటి సినిమాకి హీరోయిన్ ఇంకా దొరకలేదు. దీంతో అఖిల్ అక్కినేని సరసన నటించే హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్‌గా మారిపోయింది. 
 
అఖిల్ నటించే చిత్రానికి హీరోయిన్ ఎంపిక పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే అఖిల్‌కి స్టార్ ఇమేజ్ వచ్చేయడంతో తన తొలి సినిమాకు భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు వీవీ వినాయక్ దర్శకుడు కావడం మరింత క్రేజ్ వచ్చింది.
 
ఈ నేపథ్యంలో అఖిల్ సరసన కథానాయికగా నటింపజేసేందుకు హీరోయిన్ల వేట జరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో వున్న హీరోయిన్లంతా అతనికంటే పెద్ద వాళ్లు కావడంతో ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ భామ అలియా భట్ కోసం తీవ్రంగా ట్రై చేశారు.
 
కానీ, ఇప్పటికే తనకున్న కమిట్ మెంట్స్ కారణంగా ఆమె డేట్స్ ఇవ్వలేనని చెప్పిందట. దీంతో ఇప్పుడు మళ్లీ ఎంపిక మొదటికి వచ్చిందట. అఖిల్ సరసన నటించే ఆ ఛాన్స్ మరి ఎవరికి వస్తుందో!

Share this Story:

Follow Webdunia telugu