Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర యమ స్పీడురా బాబు!

కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర యమ స్పీడురా బాబు!
, శుక్రవారం, 30 జనవరి 2015 (20:14 IST)
తమిళ అగ్రనటుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ మహా స్పీడు. సినిమాల్లో ఓనమాలు నేర్చుకుంటున్నప్పటికీ.. ఈ చెన్నై చిన్నది మాత్రం ఓ బాలీవుడ్ యువకుడితో ఏకంగా డేటింగ్ కూడా చేసినట్టు ధైర్యంగా ప్రకటించింది. 
 
అక్క శ్రుతి హాసన్ ప్రేమ కలాపాలపై పుకార్లు షికార్లు చేసినా ఏనాడూ పెదవి విప్పలేదు. తొలి సినిమాలోనే బోల్డుగా డేటింగ్ చేశానని అక్షర తెలిపింది. వివన్ షా (నసీరుద్దీన్ షా కుమారుడు)తో తాను డేటింగ్ చేశానని, ఇప్పుడు తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పింది.
 
తనకు పదేళ్లున్నప్పడే తన తల్లిదండ్రులు విడిపోయారని, అయినా వారిద్దరూ అమితమైన ప్రేమ కురిపించారని తెలిపింది. తనకు మాత్రం తన తల్లే రాణి అని చెప్పింది. తన తల్లిదండ్రుల ఎడబాటే తానేంటో తెలిపిందని, అదే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని అక్షర వెల్లడించింది. కఠిన శ్రమ జీవినని తెలిపిన అక్షర నటన తండ్రి నుంచి అబ్బిందని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu