Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్కినేని బర్త్ డే : ఆ రెండు ఫంక్షన్లు ఒకే స్టేజ్ మీదే!

అక్కినేని బర్త్ డే : ఆ రెండు ఫంక్షన్లు ఒకే స్టేజ్ మీదే!
, శనివారం, 13 సెప్టెంబరు 2014 (13:20 IST)
మహానటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సెప్టెంబర్ 20న. అక్కినేని పుట్టినరోజును పురస్కరించుకుని ఒకే వేదికపై రెండు ఫంక్షన్లు చేసేయాలని అక్కినేని  ఫ్యామిలీ సన్నాహాలు చేస్తోంది. 
 
ఏఎన్నార్, నాగార్జున, చైతన్య కలసి నటించిన 'మనం' సినిమా నూరు రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా శతదినోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 20న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహిస్తారు.
 
అలాగే, విజయకుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య నటించిన 'ఒక లైలా కోసం' చిత్రం ప్లాటినం డిస్క్ వేడుకను కూడా ఆ రోజు అదే వేడుకపై నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పూర్తయి, విడుదలకు రెడీగా వుంది. ఇక సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించే ఛాన్సుందట.  

Share this Story:

Follow Webdunia telugu