Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సల్మాన్ అంత ఎక్కువ తాగడానికి కారణం? ఆ రోజు ఏం జరిగింది?

సల్మాన్ అంత ఎక్కువ తాగడానికి కారణం? ఆ రోజు ఏం జరిగింది?
, బుధవారం, 6 మే 2015 (21:40 IST)
సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకోవడానికి ప్రధాన కారణం ప్రేమనని తెలిసింది. హిట్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడేందుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? సల్మాన్ ఎందుకు ఒళ్లు తెలియకుండా మందు కొట్టాడు? అనేది విశ్లేషిస్తే... అప్పట్లో సల్మాన్ ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఈ క్రమంలో సల్లూభాయ్ ఆమెపై కురిపించిన ప్రేమ ఊహకందని విధంగా ఉండేది. కొన్నిసార్లు ఆమెపై చేయిచేసుకున్నాడని ఆమె స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
 
ఈ క్రమంలో ఆమె అప్పట్లో అప్ కమింగ్ హీరో వివేక్ ఓబెరాయ్‌తో సన్నిహితంగా మెలిగింది. దీనిని సల్లూ భాయ్ తట్టుకోలేకపోయేవాడు. ఈ క్రమంలో ఆ రోజు ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో తన ప్రియురాలు, వివేక్ ఓబెరాయ్‌తో సన్నిహితంగా ఉండడం చూసి, అక్కడే గొడవపడ్డాడు. ఆ కోపంలో తన సోదరుడు సోహేల్ ఖాన్, సింగర్ కమాల్ ఖాన్, మరికొంత మంది మిత్రులతో కలసి బాంద్రాహిల్ రోడ్డులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌కు వెళ్లారు.
 
అందులోని రెయిన్ బార్‌లో కూర్చుని ఫుల్‌గా తాగారు. రాత్రి 2 గంటల సమయంలో బార్ నుంచి బయటికి వచ్చి, డ్రైవర్ కోసం చూడకుండా, తన తెల్లటి టొయోటా ల్యాండ్ క్రూయిజ్ కారులో ఇంటికెళ్లేందుకు సిద్ధపడగా, పోలీస్ డిపార్ట్ మెంట్ తరపున బాడీ గార్డుగా ఉన్న రవీంద్ర పాటిల్ సల్మాన్‌ను వారించారు. వినిపించుకోని సల్మాన్ ఖాన్ కారు డ్రైవ్ చేస్తుండగా, కారులో కమాల్ ఖాన్ కూర్చున్నారు. మార్గ మధ్యంలో అదుపు తప్పిన కారు బాంద్రా రోడ్డులోని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బేకరీలోకి దూసుకుపోయింది.
 
ఈ ప్రమాదంలో బేకరి ముందు ఫుట్ పాత్‌పై పడుకున్న బేకరీ ఉద్యోగి ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. దీంతో కమాల్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, సల్మాన్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అదే రోజు సల్లూభాయ్‌ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇదీ ఆరోజు జరిగింది!. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు.. ఐశ్వర్యారాయ్‌నేనని టాక్ వస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu