Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సమంత'ది పెద్ద మనసు.. "మాన్ సూన్ నిర్వాణ"కు చేయూత!

'సమంత'ది పెద్ద మనసు..
, గురువారం, 4 సెప్టెంబరు 2014 (16:50 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంతది చాలా పెద్ద మనసు అని మరోమారు నిరూపించుకుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఆమె ఇతరుల కంటే ఒక అడుగు ముందే ఉంటుంది. గతంలో స్వచ్చంధ సంస్థలు ఏర్పాటు చేసిన పలు సమాజ సేవా కార్యక్రమాలలో ఈ సుందరి పాల్గొంది.
 
ఈ క్రమంలో ఇప్పుడు మరో కార్యక్రమంలో పాల్లొనేందుకు సమంత ఒకే చెప్పింది. రోటరీ క్లబ్, స్పర్శ్ హోస్పైస్ నిర్వహిస్తున్న 'మాన్ సూన్ నిర్వాణ' కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఆమె అంగీకరించింది. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ మరణానికి దగ్గరవుతున్న చిన్నపిల్లల కోసం నిర్వహిస్తున్న ప్రాజక్టులో ఆమె భాగస్వామి అవుతోంది. 
 
ఇందుకోసం ఈ సంస్థ ఈ నెల 6న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే కార్యక్రమానికి సమంతా ముఖ్య అతిథిగా విచ్చేస్తోంది. ఆమెతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా దీనికి హాజరవుతున్నారు. ఇందులో పాల్గొనడానికి 5000 రూపాయల విలువైన ఎంట్రీ పాస్ తీసుకోవాలి. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని ఆ చిన్నపిల్లల బాగోగుల కోసం ఖర్చు చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu