Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెంపదెబ్బ షాకిచ్చింది.. ఆ వ్యక్తిని తగిన శిక్ష పడాలి: గౌహరిఖాన్

చెంపదెబ్బ షాకిచ్చింది.. ఆ వ్యక్తిని తగిన శిక్ష పడాలి: గౌహరిఖాన్
, బుధవారం, 3 డిశెంబరు 2014 (14:32 IST)
పొట్టి దుస్తులు వేసుకున్నందుకు గానూ ఒక వ్యక్తి తనను చెంపదెబ్బ కొట్టడంతో షాక్ తిన్నానని, అయినా తాను కుంగిపోలేదని రియాలిటీ షో నటి గౌహర్‌ఖాన్ చెప్పింది. తన పట్ల క్రూరంగా వ్యవహరించిన వ్యక్తి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉండి ఉంటాడని పేర్కొన్నారు. అతని తీరుకు తగిన శిక్ష పడాలని పేర్కొన్నారు.
 
ఆదివారం ఇండియన్ రా స్టార్ ఫైనల్స్ కార్యక్రమం సందర్భంగా విరామ సమయంలో ప్రేక్షకుల్లోని ఓ వ్యక్తి ఆవేశంగా దూసుకొచ్చి.. ముస్లిం మహిళగా ఉండి పొట్టిదుస్తులు ఎలా వేసుకుంటావని గౌహర్‌ఖాన్ చెంప ఛెళ్లుమనిపించి సంగతి తెలిసిందే. ఈ దాడి తనను బాధించినప్పటికీ మరింత శక్తిమంతురాలని చేసిందని చెప్పింది. 
 
ఈ క్లిష్టసమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబసభ్యులు, బాలీవుడ్ నటులు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu