Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెబల్ స్టార్‌కు హార్ట్ ఆపరేషన్.. నిమ్స్‌లో చేరిక...!

రెబల్ స్టార్‌కు హార్ట్ ఆపరేషన్.. నిమ్స్‌లో చేరిక...!
, సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (12:40 IST)
ప్రముఖ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్యం కారణంగా ఆదివారం నిమ్స్‌లో చేరారు. గుండెల్లోని రక్తనాళాల్లో పూడికలు రావడంతో నిమ్స్ లోని కార్డియాలజీ విభాగంలో కృష్ణం రాజుకి నిమ్స్ వైద్యుడు డాక్టర్ శేషగిరి రావు ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స నిర్వహించారు.
 
ప్రస్తుతం కృష్ణం రాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం సీనియర్ నటుడు చంద్రమోహన్.. గుండె నొప్పి కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే.

ప్రముఖ నిర్మాత రామానాయుడు మరణించిన షాక్‌లో సినీ ఇండస్ట్రీ వుండగానే, నటుడు చంద్రమోహన్ గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడం తో మళ్లీ ఒక్కసారిగా సినీ పరిశ్రమ షాక్ గురియ్యంది. ఇప్పుడు చంద్రమోహన్ ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఇండ్రస్ట్రీ ఊపిరి పీల్చుకున్నది. ఇంతలోనే ఇలా కృష్ణంరాజు అనారోగ్యానికి గురయ్యారు అని తెలియగానే సినీ రంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu