Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఐశ్వర్యా పాయింట్'లో అభిషేక్... జోరుగా షూటింగ్..!

'ఐశ్వర్యా పాయింట్'లో అభిషేక్... జోరుగా షూటింగ్..!
, గురువారం, 26 ఫిబ్రవరి 2015 (16:47 IST)
'ఐశ్వర్యా పాయింట్'లో అభిషేక్ బచ్చన్ జోరుగా షూటింగ్ జరుగుతుంది. ఇదేదో సెక్సీ టాక్ అనుకునేరు. కాదు, మీరు చదివేది నిజమే. షూటింగ్ జరిగే స్పాట్ పేరు అదే. నాసిక్ లోని త్రియంబకేశ్వర్ వద్ద 'ఐశ్వర్యా పాయింట్' అనే ప్రసిద్ధి చెందిన షూటింగ్ స్పాట్ వుంది. అభిషేక్ బచ్చన్న నటిస్తున్న తాజా చిత్రం 'ఆల్ ఈజ్ వెల్' సినిమా కోసం ప్రస్తుతం అభీ అక్కడ యాక్షన్ ఎపిసోడ్ జోరుగా చేస్తున్నాడు. 
 
కాగా ఈ లొకేషన్‌కి ఆ పేరు రావడం వెనుక ఆసక్తికరమైన సమాచార దాగి ఉంది. అదేమంటే.. గత 12 ఏళ్ల క్రితం విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్  'ఖాకీ' సినిమా కోసం అక్కడ షూటింగ్ చేస్తూ యాక్సిడెంటుకి గురైంది. అయితే ఆ ఘోర ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ఐశ్వర్య ప్రాణాలతో బయటపడింది. ఎడమ పాదానికి ఫ్రాక్చర్ తగిలించుకుంది. అప్పటి నుంచీ ఆ స్పాట్‌కు ఐశ్వర్యా పాయింట్ అనే పేరు నిలిచిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu