Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పీకే' సెకండ్ లుక్ పోస్టర్... బట్టలేసుకుని బ్యాండ్ మేళంతో అమీర్!

'పీకే' సెకండ్ లుక్ పోస్టర్... బట్టలేసుకుని బ్యాండ్ మేళంతో అమీర్!
, గురువారం, 21 ఆగస్టు 2014 (09:42 IST)
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తాజా చిత్రం పీకే. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌గా విడుదల చేసిన పోస్టర్ దేశంలో పెను దుమారం రేపింది. ఈ వివాదం చివరకు న్యాయ స్థానానికి చేరగా, ఇక్కడ అమీర్ ఖాన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా విడుదల చేసిన సెకండ్ లుక్ పీకే పోస్టర్ కూడా ఇదే విధంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే, తొలి పోస్టర్‌లో టేప్ రికార్డర్‌ను అడ్డు పెట్టుకుని న్యూడ్ కటౌట్‌తో దర్శనమిచ్చిన అమీర్ ఖాన్.. రెండో ఫస్ట్ లుక్‌లో మాత్రం ఒంటినిండా దుస్తులు ధరించి కనిపించి అందరినీ విస్మయానికి గురి చేశారు. 
 
తద్వారా సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో తనను చూసి నేర్చుకోమని చెప్పకనే చెప్పాడీ బాలీవుడ్ హీరో. అమీర్ అప్‌కమింగ్‌ మూవీ 'పీకే'లో విభిన్న గెటప్స్‌తో ముందుకొస్తున్న విషయం తెల్సిందే. ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్ మైండ్‌ పోయేటట్లు చేసి విమర్శలను మూటగట్టుకున్న ఈ మిస్టర్‌ పర్ఫెక్ట్ సెకండ్‌ లుక్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 
 
తాజా పోస్టర్‌తో వారి నోళ్లకు తాళాలు పడ్డాయి. పూర్తిగా బట్టలేసుకుని కనిపించిన అమీర్ టేప్‌ రికార్డర్‌ని వదిలేసి బ్యాండ్‌ మేళం పట్టుకుని నిల్చున్నాడు. నిన్నటి దాకా గొంతు చించుకున్న క్రిటిక్స్ ఈ పోస్టర్‌పై ఎలా స్పందిస్తారో.

Share this Story:

Follow Webdunia telugu