Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీకే కోసం.. ఒకే రోజు 100 కిళ్లీలు తిన్న అమీర్ ఖాన్!

పీకే కోసం.. ఒకే రోజు 100 కిళ్లీలు తిన్న అమీర్ ఖాన్!
, శనివారం, 25 అక్టోబరు 2014 (15:12 IST)
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పీకే సినిమా కోసం రోజుకు 100 కిళ్లీలు తినాల్సి వచ్చింది. ఈ సినిమాలో అమీర్ మొత్తం తొమ్మిది గెటప్పులలో కనిపిస్తాడు. వాటిలో ఓ గెటప్పు తమాషాగా వుంటుంది. ఎప్పుడూ కిళ్లీలు నములుతూ, పక్కనే ఉమ్ములేస్తూ ఉంటాడట.
 
దీని గురించి అమీర్ చెబుతూ, "మామూలుగా నాకు కిళ్లీ తినే అలవాటు లేదు. ఎప్పుడైనా ఒకటీ అరా తింటానంతే. అయితే, ఈ పాత్ర కోసం రోజుకి వంద కిళ్లీలను తిన్నాను. ఆ షూటింగు జరిగినన్నాళ్ళూ ఓ పాన్ వాలా మాతోనే ఉంటూ ఎప్పటికప్పుడు కిళ్లీలు చుట్టి ఇస్తుండేవాడు" అని వివరించాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఎంతో సంచలనం సృష్టించిన ఈ సినిమా రిలీజయ్యాక మరెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!

Share this Story:

Follow Webdunia telugu