Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

80 ఏళ్ళ సినీ హడావుడి పండుగ: మా మురళీమోహన్ తడబాటు

80 ఏళ్ళ సినీ హడావుడి పండుగ: మా మురళీమోహన్ తడబాటు
, శనివారం, 10 సెప్టెంబరు 2011 (16:02 IST)
WD
టాకీ ప్రారంభమై ఈ నెల 15 నాటికి 80 ఏళ్లు పూర్తవుతాయి. 1931 సెప్టెంబర్‌ 15న భక్తప్రహ్లాద చిత్రం విడుదలైంది. మొదటి టాకీ చిత్రమదే. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన ఇండస్ట్రీ పెద్దలు ఆఘమేఘాల మీద ఏదో చేశాం అనిపించుకునేలా చేయడానికి ట్రై చేస్తున్నారు. శనివారం ఫిలింఛాంబర్‌లో ఈ విషయమై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఫిలింఛాంబర్‌ కొత్త అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ, 'మా' అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌, ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

మురళీమోహన్‌ తడబాటు
ముందుగా మురళీమోహన్‌ మాట్లాడుతూ, అంతకుముందే ఇంగ్లీషులో ప్రింట్‌ అయిన బుల్‌టెన్‌ను విలేకరులకు ఇచ్చారు. దాన్నే చదువుతూ... సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య అని చదువుతూ. తొలిటాకీని ఆయనే దర్శకత్వం వహించారు అని అన్నారు. దీంతో... సీనియర్‌ విలేకర్లు... హెచ్‌.ఎం.రెడ్డిగారు సార్‌.. అంటే.. 'ఓ. హెచ్‌.ఎం.రెడ్డి గారే నిర్మించారా? అంటూ..' మళ్ళీ కొనసాగించాడు. కాదుసార్‌.. ఆయన దర్శకుడు. నిర్మాత ముంబైకు చెందిన మాణిక్‌ అని పేరు చెప్పగానే.... తడబడుతూ... వెంటనే.... సరైన టైం లేక ఈ వేడుకను చేస్తున్నాం. దీనికి 'తెలుగు చలనచిత్రోత్సవం' అని పేరు పెట్టాం. ఆనాడు అందరూ వస్తారు. వచ్చే ఏడాది నుంచి ముందుగా ప్లాన్‌ ప్రకారం చేస్తాం. ఇందుకు మీడియా సపోర్ట్‌ కావాలి. మీరే సినిమాల గురించి గత తరం గురించి వివరాలు రాస్తూ పేపర్లలో, టీవీల్లో చూపిస్తూ ప్రచారం చేయండని అన్నారు.

తర్వాత ఛాంబర్‌ అద్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ.., (ఇంగ్లీషు తప్ప తెలుగు రాదు).. మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 15న ఏం చేయాలనేది ఇంకా స్పష్టత లేదు. సోమవారానికి క్లియర్‌గా ఉంటుంది. ఈసారి ఆరోజు అంతా షూటింగ్‌లకు వెళతారు. అందుకే ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో జెండా ఎగురవేసి, ప్రసంగాలు నిర్వహిస్తాం. ఇవన్నీ ఛాంబర్‌ ఆవరణలో జరుగుతాయి. వచ్చే ఏడాది నుంచి ఒక పండుగలా చేస్తాం అన్నారు. ఈ సందర్బంగా మీడియా అంతా తగిన సూచనలు ఇవ్వండని మిగిలిన కార్యవర్గం చెప్పారు.

కొసమెరుపు
గతంలోనే 75 ఏళ్ల ఇండస్ట్రీ చరిత్రను మాదాపూర్‌లోని నోవాటెల్‌లో ఘనంగా నిర్వహించారు. ఇండస్ట్రీలో తరతమ భేదాలున్నా.. ఎట్టకేలకు ఒకచోట చేరారు. అయితే.. చిరంజీవి వర్సెస్‌ మోహన్‌బాబు ఫంక్షన్‌‌గామారి 'సిల్లీ ఫెలో..' అనే మాట హైలైట్‌ అయి ఆ ఫంక్షన్‌ చాలా క్లిక్‌ అయింది. అప్పట్లోనే.. ప్రతి ఏడాది ఈ పండుగ జరుపుకుంటామని చెప్పారు. మళ్ళీ ఐదేళ్లకు ఇప్పుడు గుర్తుకు రావడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu