Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21న రామ్‌చరణ్, జెనీలియా కొత్త చిత్రం ప్రారంభం!

21న రామ్‌చరణ్, జెనీలియా కొత్త చిత్రం ప్రారంభం!
WD
ప్రముఖ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ హీరోగా, బొమ్మరిల్లు కథానాయికగా జెనీలియా హీరోయిన్‌గా రూపొందించనున్న మెగా మూవీ ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.

కె. వెంకట్రావు సమర్పణలో మెగాబ్రదర్ కె. నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించడం విశేషం. ప్రెస్టీజియస్ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.7గా ఈ క్రేజీ మూవీ రూపొందుతోంది.

ఈ చిత్ర విశేషాలను నిర్మాత నాగేంద్రబాబు తెలియజేస్తూ.. అక్టోబర్ 21న పూజాకార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని, హైటెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని నాగేంద్రబాబు వెల్లడించారు.

ఈ చిత్రం కోసం కొంత పార్ట్ షూటింగ్ యుఎస్, ఆస్ట్రేలియాల్లో ప్లాన్ చేశామని, బొమ్మరిల్లు, పరుగు వంటి హిట్ చిత్రాల తర్వాత భాస్కర్- రామ్‌చరణ్ తేజ‌తో ఈ సినిమా చేస్తున్నారని నాగేంద్రబాబు అన్నారు. అందరి అంచనాలను మించే విజయాన్ని ఈ చిత్రం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

రామ్‌చరణ్‌తేజ, జెనీలియా జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: హరీష్ జైరాజ్, కెమెరా: కిరణ్‌రెడ్డి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్, నిర్మాత: కె. నాగేంద్రబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్.

Share this Story:

Follow Webdunia telugu