Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10న "సరే నీ ఇష్టం" ఆడియో విడుదల

10న
WD
పూర్ణచంద్ర మూవీ మేకర్స్ పతాకంపై భాగ్యరాజా తనయుడు శాంతన్ భాగ్యరాజ్ హీరోగా, అంద్రితను కథానాయికగా పరిచయం చేస్తూ ఆముదాలు దేవేష్ సమర్పణలోరూపుదిద్దుకుంటోన్న చిత్రం "సరే నీ ఇష్టం". మహేష్ చంద్ర స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం డబ్బింగ్ పూర్తిచేసుకుంది. మరోవైపు రీరికార్డింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర ఆడియోను ఈ నెల 10వ తేదీన లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోందని ఆయన తెలిపారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం.. చక్రి, కెమేరా.. విజయ్ కుమార్, నిర్మాతలు, మహేష్ చంద్ర, రమేష్ రెడ్డి, జీవిత రెడ్డి, సోమారెడ్డి, విజయ్, దర్శకత్వం.. మహేష్ చంద్ర.

Share this Story:

Follow Webdunia telugu