Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇన్నేళ్ల తర్వాత నా అసలైన ఆస్తి ఏమిటో తెలిసింది... మోహన్ బాబు ట్వీట్

ఇన్నేళ్ల తర్వాత నా అసలైన ఆస్తి ఏమిటో తెలిసింది... మోహన్ బాబు ట్వీట్
, గురువారం, 21 మే 2015 (14:47 IST)
మా అబ్బాయి మనోజ్ పెళ్లి పిలుపుకు అంతా వచ్చి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటన్నానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్విట్టర్లో తెలియజేశారు. ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే, అంబరీష్, సుమలతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంకా దేశవిదేశాల నుంచి వధూవరులను దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలంటూ పేర్కొన్నారు. 
 
ఇన్నేళ్ల తర్వాత నా నిజమైన ఆస్తి ఏమిటో తెలుసుకున్నాను... అది నా కుటుంబం, నా స్నేహితులు, నా క్షేమాన్ని కోరుకుంటున్న వారందరూ.  పార్క్ హయత్ హోటల్ సిబ్బందికి కృతజ్ఞతలు. ఇంకా టి. సుబ్బరామిరెడ్డికి నా ధన్యవాదాలు. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వధూవరులను దీవిస్తూ పంపిన ఉత్తరం, ఆయన ఎంతో బిజీ షెడ్యూల్లో సైతం తమను గుర్తుపెట్టుకుని దీవెనలు అందించినందుకు ధన్యవాదాలు. నరేంద్ర మోడీ నుంచి యువ నాయకులు, యువత ఒక నాయకుడంటే ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలంటూ సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu