Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాట్‌ బ్యూటీ షెర్లిన్ పొలిటికల్‌ కామెంట్స్‌...!

హాట్‌ బ్యూటీ షెర్లిన్ పొలిటికల్‌ కామెంట్స్‌...!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (17:58 IST)
FILE
బాలీవుడ్ హాట్ సెక్స్‌బాంబ్ షెర్లిన్ చోప్రా మన తెలుగమ్మాయే. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది ఈ అందాల భామ. తెలుగులో ఎ ఫిం బై అరవింద్ సినిమాలో నచించిన షెర్లిన్ చోప్రా, అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంది. పోర్న్‌స్టార్‌గా తన అందాలతో ప్రేక్షకులను ఆనందపరుస్తున్న షెర్లిన్ ముంబైకి వెళ్ళినా మన రాష్ట్రంపై మమకారం పోలేదు.

ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న మమకారంతో రాష్ట్ర విభజనను ఖండించింది. రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తారని ప్రశ్నించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటయితే దానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారని నిలదీసిందామె. విభజన చేయాలన్నవారు ప్రజల చేత, ప్రజలకొరకు పనిచేస్తున్నారా? అని ప్రశ్నించింది షెర్లిన్. దేశాన్ని ఇంకా ముక్కలు చేయకండి. అని అభ్యర్థించిన షెర్లిన్ చోప్రా, ప్రజలంతా ఇలాంటి పనికిమాలిన రాజకీయాలపై తిరగబడాలని పిలుపునిచ్చంది.

Share this Story:

Follow Webdunia telugu