Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్సీ భామ కోసం క్యూకట్టిన నటులు... 25 వేల మంది అప్లికేషన్లు...

సెక్సీ భామ కోసం క్యూకట్టిన నటులు... 25 వేల మంది అప్లికేషన్లు...
, సోమవారం, 29 జూన్ 2015 (12:50 IST)
బాలీవుడ్‌లో తన అందాలను ఆరబోసే పూనమ్‌ పాండే గురించి తెలియంది కాదు. ఎప్పుడూ వార్తలో వుండే ఈ భామ ఓ ఆఫర్‌ ఇచ్చింది. 'ఖౌన్‌ బనేనా పూనమ్‌ పాండే కా హీరో' అంటూ ఓ కాంటెస్ట్‌ పెట్టింది. దీనిపై దర్శకనిర్మాత సురేష్‌ నకుమ్‌.. తాజాగా చిన్నపాటి ప్రకటన ఇచ్చాడు. తాను తీయబోతున్న 'హెలెన్‌' సినిమాకు ఆమెతో కలిసి జతకట్టే కొత్తవ్యక్తి కావాలన్నది దాని సారాంశం.
 
అంతే... విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన మాట్లాడుతూ... నేనింత రెస్పాన్స్‌ వస్తుందని ఊహించలేదు. ఇంతకుముందు చేసిన సినిమాల్లో ఇలాంటి అవకాశం రాలేదు. కేవలం ప్రాజెక్ట్‌ కాకముందే దాదాపు 25 వేల అప్లికేషన్లు రావడం థ్రిల్‌ కల్గించింది. ఇందులో పాత్ర కోసం రెండు నిముషాల వీడియోలు కూడా పంపినవారున్నారు. ఇవన్నీ చూసి ఎంపిక చేయడం కష్టమైన పనేనంటూ... అనుకున్న ప్రకారం వచ్చనెలలో షూటింగ్‌ చేయనున్నామని అన్నారు. మరి ఆమెతో నటించే అదృష్టవంతుడు ఎవరో త్వరలో తేలనుంది.

Share this Story:

Follow Webdunia telugu