Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సీతమ్మ వాకిట్లో...' తమిళ వెర్షన్ రెడీ

'సీతమ్మ వాకిట్లో...' తమిళ వెర్షన్ రెడీ
, సోమవారం, 7 అక్టోబరు 2013 (12:54 IST)
FILE
గత సంక్రాంతికి విడుదలై ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా మన్ననలందుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలోకి డబ్ చేస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు లతో బాటు అంజలి, సమంతా, ప్రకాష్ రాజ్ వంటి తారలు ప్రధాన పాత్రలు పోషించడంతో తమిళ ప్రేక్షకులకు కూడా ఇది బాగా నచ్చుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి తమిళంలో 'ఆనందం ఆనందమే' అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో భారీ ఎత్తున తమిళనాట రిలీజ్ చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu