Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెబ్ దునియా న్యూస్... తెలుగువన్ కాపీ... 'బాద్‌షా'కు మహేష్ వాయిస్

వెబ్ దునియా న్యూస్... తెలుగువన్ కాపీ... 'బాద్‌షా'కు మహేష్ వాయిస్
, శనివారం, 23 మార్చి 2013 (15:01 IST)
WD
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా' చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రిన్స్ వాయిస్ అదరహో అన్నట్లుగా ఉందనీ, ఏప్రిల్ 5న బాద్ షా విడుదలయిన తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగేనని అంటున్నారు.

కాగా 'దూకుడు' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల మహేష్ బాబును వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారనీ, దాంతో మహేష్ బాబు ఓకే చెప్పారని అంటున్నారు. 'బాద్‌షా'పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అంతేకాదండోయ్ బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో ఫ్యామిలీ స్టార్ సిద్దార్థ్ కూడా ఓ అతిథి పాత్రను పోషించాడని సమాచారం. ఇటీవలి కాలంలో ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ అందించడం తెలుగు సినిమాల్లో పెరుగుతూ వస్తోంది. చూడాలి బాద్ షా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో...?!!

Share this Story:

Follow Webdunia telugu