లెజండ్ ఆడియోకు హాట్ యాంకర్.. చూపులన్నీ ఆమెపైనే!
, శుక్రవారం, 7 మార్చి 2014 (09:42 IST)
బుల్లితెర యాంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్ యాంకర్ అనసూయకు ఇపుడు ఓ ఆఫర్ వచ్చింది. బాలకృష్ణ నటించిన 'లెజండ్' ఆడియోకు ఈ భామకు యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. హీరోయిన్ స్థాయిలో అనసూయకు ఫ్యాన్స్ ఉన్నారు. అనసూయ స్టేజ్ ఎక్కితే, కళ్లన్నీ అక్కడే!శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో లెజెండ్ పాటల్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు అనసూయ యాంకరింగ్ చేయనుంది. శ్రీనువైట్ల, రాజమౌళి, సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, వినాయక్, ఇలా టాలీవుడ్లో పేరున్న దర్శకులంతా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. లెజెండ్ పాటలు, అనసూయ యాంకరింగ్, బాలయ్య మాటలు… ఇంకేం కావాలి..?? లెజెండ్ ఆడియో ఇక అదరహొనే.