Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రీరికార్డింగ్ కార్యక్రమాల్లో "నేరము-శిక్ష"

రీరికార్డింగ్ కార్యక్రమాల్లో
WD
పద్మభూషణ్ కృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం "నేరము-శిక్ష". ఆకుల్, ధీరజ్, ఆకర్ష, రూపా జంటలను కొత్తగా పరిచయం చేస్తూ విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయనిర్మల దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం గురించి విజయనిర్మల మాట్లాడుతూ.. నిర్మాణంతో పాటు డబ్బింగ్ కూడా పూర్తయి ఈ వారంలో రీరికార్డింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

కీ.శే. బొల్లిముంత నాగేశ్వరరావు రచించిన "వల" అనే నవల ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఉరిశిక్ష అమలుపై పునరాలోచించాలని చర్చించడమే ప్రధాన కథాంశమని విజయ నిర్మల అన్నారు. ఈ చిత్రానికి కోటి స్వరపరచిన 5 గీతాలతో కూడిన ఆడియో ఆదిత్య ద్వారా త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu