Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్ 'మసాలా' 'గే' అవ్వొద్దనుకొని... అయిపోయాడు!

రామ్ 'మసాలా' 'గే' అవ్వొద్దనుకొని... అయిపోయాడు!
, శనివారం, 9 నవంబరు 2013 (12:10 IST)
FILE
విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ స్టార్ రామ్‌లు నటించిన 'మసాలా' త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్స్, ఆడియో రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్ నటించడానికి కారణం వెనుక కొన్ని ఆసక్తికర సంగతులు తెలిశాయి. హీరో రామ్ స్వయంగానే ఆ సంగతలు చెప్పాడు.

రామ్ చెబుతూ... ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించాను. మొదట నేను ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇందులో ఓ తేడా పాత్ర ఉంది. ఇలాంటిది వేరెవరూ చేయలేరేమో! నేను మాత్రమే చేశాను. ఇకముందు కూడా ఇలాంటిది మనవాళ్లెవరూ చేయరేమో! నేను కూడా చేయ్యని పాత్ర అది అని అన్నాడు.

హీందీ వెర్షన్ బోల్‌బచ్చన్‌కి తెలుగు వెర్షన్‌కి చాలా మార్పులు చేశారు. అయితే అందులోని తేడా పాత్ర మాత్రం అలానే ఉంది. 'గే'కి తేడాగాడికి ఉన్న తేడా మన ఆడియన్స్‌కి అంతగా తెలియదు. ఇది చేస్తే ఎలా అని చాలా టెన్షన్ పడ్డా. ముందు చేస్తానని చెప్పలేదు. పెదనాన్న (స్రవంతి కిషోర్)కి నేను ఓ రెండ్రోజులు ఆలోచించుకుని చెబుతానని చెప్పాను. అసలు నేనప్పుడూ ఇలా మల్టీస్టారర్ చేస్తానని అనుకోలేదు. అందునా ఇలాంటి తేడా పాత్ర చేస్తానని అనుకోలేదు. అదంతా యాధృచ్ఛికంగా జరిగిపోయిందని రామ్ అంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu