Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగా హీరోల సినిమాలను ఆపితే ఖబడ్దార్: చిరంజీవి యూత్

మెగా హీరోల సినిమాలను ఆపితే ఖబడ్దార్: చిరంజీవి యూత్
, మంగళవారం, 6 ఆగస్టు 2013 (14:11 IST)
FILE
కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలను అడ్డుకుంటామని సమైక్యవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామినాయుడు తీవ్రంగా స్పందించారు. మెగా హీరోల సినిమాలను ఆపితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఉద్యమకారుల పేరిట కొందరు తమ హీరోల కటౌట్లు తగలబెడుతున్నారనీ, దీనిని చూస్తూ ఊరుకోమనీ స్వామినాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఇలా స్వామినాయుడు ప్రకటించడం వెనుక మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ హస్తం ఉందని కొందరు అంటున్నారు. మరి, దీని పట్ల సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu