Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ బాబుకు షూటింగ్‌లో గాయం.. ఆగడుకు బ్రేక్!

మహేష్ బాబుకు షూటింగ్‌లో గాయం.. ఆగడుకు బ్రేక్!
, శుక్రవారం, 7 మార్చి 2014 (16:04 IST)
FILE
దూకుడు కాంబినేషన్ శ్రీనువైట్ల- మహేష్‌ల తాజా చిత్రం 'ఆగడు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను బళ్ళారిలోని షూట్ చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్‌లో మహేష్ బాబు గాయపడినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆగడు మూవీ షూటింగ్ బ‌ళ్ళారిలో జ‌రుపుకుంటుంది. ఆగ‌డు టైటిల్ సాంగ్‌ను కూడ బ‌ళ్ళారిలోనూ చిత్రీక‌రిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ జరుగుతుండగా మహేష్ ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. ఆయన చేతికి గాయం కావడంతో షూటింగ్కు తాత్కిలికంగా బ్రేక్ చెప్పారు. మహేష్ను పరీక్షించిన వైద్యులు ఆయనకు కనీసం వారం రోజులు విశ్రాంతి ఇవ్వాలని చెప్పడంతో ఈ చిత్రం షెడ్యూల్ ను వారం రోజులు బ్రేక్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu