Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్‌బాబు బర్త్‌ డే గిఫ్ట్ డైలాగ్‌‌తో కూడిన టీజర్‌....!

మహేష్‌బాబు బర్త్‌ డే గిఫ్ట్ డైలాగ్‌‌తో కూడిన టీజర్‌....!
, గురువారం, 8 ఆగస్టు 2013 (16:22 IST)
FILE
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన జన్మదినోత్సవాన్ని ఈసారి లండన్‌లో గ్రాండ్‌గా జరుపుకోనున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం '1 నేనొక్కడినే' భారీ షెడ్యూల్‌ చాలా రోజులుగా లండన్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 9న ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డైలాగ్‌తో కూడుకున్న ఓ చిన్న టీజర్‌ను విడుదల చేస్తారని సమాచారం.

ఇప్పటికే విడుదల చేసిన మొదటి టీజర్‌లో డైలాగ్‌ లేకపోవడంతో ఈ సారి డైలాగ్‌ కలిగిన టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మహేష్‌ సరసన నూతన నటి కృతిసనన్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu