Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో రికార్డుకోసం వేచి చూస్తున్న విజయనిర్మల

మరో రికార్డుకోసం వేచి చూస్తున్న విజయనిర్మల
, శనివారం, 9 ఫిబ్రవరి 2008 (11:48 IST)
WD
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మహిళా దర్శకులలో విజయనిర్మల ఒకరు. అతి తక్కువ కాలంలోనే దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులలోకి ఎక్కిన ఘనత ఆమెది. ప్రస్తుతం మరో రికార్డు నెలకొల్పేందుకు ఆమె సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం ఆమె భర్త సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సోల్జర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలియజేస్తున్నారు.

గతంలో నాగభూషణం నిర్మించిన ప్రేమ చేసిన పెళ్లి చిత్రాన్ని 12 రోజుల్లో పూర్తి చేశానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను నిర్మాత, దర్శకురాలిననీ... నిర్మాత బావుంటేనే అందరూ బావుంటారనీ అన్నారు. ఈ చిత్రాన్ని నటుడు బాలాజీ నిర్మిస్తున్నారనీ, పరిమిత బడ్జెట్‌లో అనుకున్న సమయంలో ఈ చిత్రాన్ని తీసి రికార్డు సృష్టిస్తానని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu