Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మగాళ్లందరూ ఒకలా ఉండరు: అమృతారావు

మగాళ్లందరూ ఒకలా ఉండరు: అమృతారావు
లేలేత అందాలతో, ప్రేక్షకులకు కిక్కెక్కించే అందాల తార అమృతా రావు. ఈ సుందరికి విదేశీ వస్త్రాలంటే మహా మోజట. అందుకేనేమో ఎప్పుడు చూడు.. బ్యాంకాక్ మరియు జపనీస్ డిజైనరీ బొటిక్‌లలో కనబడుతుంది. వళ్లంతా ప్రదర్శితమయ్యే విధంగా ఉండే దుస్తులను ధరించడం సుతారము ఇష్టం లేదని చెప్పే ఈ అందాల రాణి... సన్నివేశాలకు తగ్గట్లు కొన్నిసార్లు ఇష్టం లేకున్నా చేయక తప్పడం లేదంటోంది.

మగాళ్లపై నీ అభిప్రాయం ఏమిటీ...? అందంగాలేని అమ్మాయిలపట్ల మగాళ్లకు అంతగా ఆసక్తి ఉండదనే అంశంపై ఏమంటారు...? ఇత్యాది పురుష సంబంధిత ప్రశ్నలకు అమృత ఇలా సమాధానం చెపుతోంది.

"మగాళ్లందరూ ఒకలా ఉండరు. అందం అనేది ఆయా వ్యక్తులు చూసే కోణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నేను చూసిన జంటల్లో సూపర్‌స్టార్లుగా మెరిసే హ్యాండ్‌సమ్ పురుషులు... అందంలో తీసికట్టుగా ఉన్న అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కనుక అందం అనేది... మనసుపై ఆధారపడి ఉంటుంద"ని చెప్పింది. అమృత చెప్పిన మాటలు 100 శాతం నిజమే కదూ...

Share this Story:

Follow Webdunia telugu