Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...
, శనివారం, 17 మే 2014 (19:25 IST)
FILE
బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో నటిస్తోంది. సన్నీని పెద్ద సంస్థలు ఓ ఐటం సాంగ్‌ కోసం ట్రై చేశాయి. కానీ ఎందుకనో వర్కవుట్‌ కాలేదు. కానీ మంచు ఫ్యామిలీ మాత్రం ఎలాగోలా పట్టేసింది.

ఈ విషయాన్ని మంచు మనోజ్‌ ధృవీకరించాడు. హ్యాపీడేస్‌లో లాగే ఓ లెక్చరర్‌ పోస్ట్‌లో ఆమె నటిస్తుంది. ఆమెను చూసి చొంగ కార్చుకునే పాత్ర మంచు మనోజ్‌ది. కాగా, సన్నీ.. మనోజ్‌కు క్లాసులు చెబుతుందంటూ ఇటీవల నెట్‌లో న్యూస్‌ వచ్చేసింది.

ఎటువంటి క్లాస్‌లు అని మనోజ్‌ను అడిగితే... అబ్బే.. అప్పుడే చెప్పేస్తామా.. చూడండి అంటూ.. ఓ సాంగ్‌తో పాటు రెండు సీన్లలో ఆమె నటిస్తుందని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆమె మంచు ఫ్యామిలీ నిర్మించే మిగతా చిత్రాల్లోనూ నటిస్తుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu