Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెల్లంకొండ శ్రీనివాస్‌ వచ్చేస్తున్నాడు... తొలి హీరోయిన్ సమంత

బెల్లంకొండ శ్రీనివాస్‌ వచ్చేస్తున్నాడు... తొలి హీరోయిన్ సమంత
, బుధవారం, 6 ఫిబ్రవరి 2013 (18:33 IST)
WD
హీరోల వారసులు, నిర్మాతల వారసులు, దర్శకుల వారసులు, నటీనటుల వారసులు వస్తున్న తరుణంలో మరో కొత్త కెరటం రాబోతుంది. నిర్మాతగా పలు హిట్స్‌ ఇచ్చిన బెల్లంకొండ సురేష్‌ తన వారసుడ్ని కథానాయకుడిగా పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తయ్యాయి.

ఈ నెల 15న రామానాయుడు స్టూడియోలో చిత్రం ప్రారంభించనున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్‌ లుక్‌ చాలా బాగుందని ఇండస్ట్రీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడేళ్లుగా తన కొడుకు కెరియర్‌పై దృష్టి సారించిన బెల్లంకొండ సురేష్‌ విదేశాలతోపాటు మన రాష్ట్రంలోనూ నాట్యం, నటన, డాన్స్‌లోనూ తర్ఫీదు ఇప్పించాడు.

డాన్స్‌పరంగా ఇరగదీస్తాడని విశ్వసనీయ సమాచారం. ఆరు అడుగుల ఎత్తు ఉండే బెల్లంకొండ శ్రీనివాస్‌.... ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు తన కుమారుడు వెంకటేష్‌ను ఎలా తీర్చిదిద్దారో అలాగే సురేష్ చేశారని కొందరు పోలిక చేయడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu