Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బి బ్లాగుకు "బూతు" దెబ్బ: ఊగిపోతున్న అమితాబ్

బిగ్ బి బ్లాగుకు
WD
మనిషి నోరు మంచిని ఎంత చక్కగా మాట్లాడగలదో చెడ్డనూ అదే రేంజ్‌లో మాట్లాడగలదు. అదే విధంగా చేష్టలు సైతం... అలాగే రాతలు కూడా. ఇదంతా ఎందుకంటారా...? ఇపుడు ఆన్‌లైన్‌లో రాతల బూతు పురాణం మహాసముద్రంలా మారిపోయింది. చేతికి వచ్చిన బూతును సిగ్గూ ఎగ్గూ లేకుండా, మానాభిమానాలు మరిచి, మానవ సంబంధాలను సైతం విస్మరించి చేతిలో "మౌస్" ఉంది కదా అని తెగ బూతును ఆడించేస్తున్నారు కొందరు వీక్షకులు. ఇపుడీ "బూతు" దెబ్బకు పీడుతుడైన యాక్టర్ బిగ్ బి అమితాబ్.

అమితాబ్ రూపొందించిన బ్లాగులో తన సినిమాలు, తన అనుభవాలను పంచుకోవడం ఎప్పటి నుంచో చేస్తున్నారు. అమితాబ్ బ్లాగులో పంచుకున్న భావాలకు.. దేశం, ప్రపంచంలోని ఆయా వీక్షకులు తమతమ అభిప్రాయాలను జోడించడమూ జరుగుతూ వస్తోంది. కానీ హఠాత్తుగా ఇటీవల అమితాబ్ బచ్చన్‌ను ఓ బూతు సందేశం వెక్కిరించింది.

తొలుత ఆ బూతును డిలిట్ చేసిన అమితాబ్ మిన్నకుండిపోయారు. కానీ సదరు "బూతు" వీక్షకుడు మాత్రం బిగ్ బిని వదల్లేదు. మళ్లీ బండబూతులతో కూడిన సందేశాలతో బ్లాగుపై దండెత్తాడు. దీంతో సహనం నశించిన బిగ్ బి నేరుగా సదరు బూతు వీక్షకునికి తిరుగు టపా రాస్తూ.. తాను ఒక దశ వరకే మంచివాడిననీ, ఆ దశ దాటితే తను ఎటువంటి వాడినో చూడాల్సి వస్తుందని హెచ్చరించాడు.

అయితే మాత్రం ఆ బూతు వీక్షకుడు ఊరుకున్నాడా...? ఈసారి నేరుగా సెల్‌ఫోనుకే బూతులను పంపించడం మొదలుపెట్టాడు. దీంతో కోపం నషాలానికంటిని అమితాబ్, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ బూతు వీక్షకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన మరుసటి రోజు నుంచి అమితాబ్‌కు బూతు వీక్షకుడు తిరిగి ఎటువంటి సందేశం పంపలేదని సమాచారం. ఒకవేళ మళ్లీ బూతు పోస్ట్ చేస్తే పోలీసుల బోనులో పడటం ఖాయం.. ఆనక బూతు పురాణాన్ని వల్లె వేసినందుకు కుళ్ల బొడవడమూ ఖాయమని అంటున్నారు పోలీసులు.

మరి బూతు వీక్షకుడికి తిరిగి బూతు సందేశాన్ని పోస్ట్ చేసే దమ్మూ ధైర్యం ఉండి ఉంటుందా..? అయినా అభిప్రాయాలను బూతు భాషలో కాక మంచి భాషలో చెప్పటం రాదా..? ఈ బూతుగాళ్లను ఏడు ఊచల పోలీసు బూతులో పెట్టి కుళ్లబొడిస్తే సరి.. అప్పుడైనా సిగ్గొస్తుంది.. అని బిగ్ బి సన్నిహితుడొకరు పళ్లు పటపట కొరుకుతూ పోలీసుల వద్ద తన స్నేహితునికి జరిగిన అవమానాన్ని తలుచుకుని వాపోయాడట. ఏం చేద్దాం.. బూతుగాళ్లకు బూతు రాతలు తప్ప మంచి మాటలు రావాయే మరి.

Share this Story:

Follow Webdunia telugu